వివిధ గ్రంథాలు, మహాపురుషుల జీవిత గాథలు, కొన్ని మంచి పుస్తకాల నుండి గ్రహించబడిన వాటి సంకలనాలు ఈ పరమ సత్యం బ్లాగు నందు మీరు తెలుసుకొనవచ్చు.

Monday, February 28, 2011

గౌతమ వాక్కు 3


మితిమీరిన ఆత్మవిశ్వాసం కన్నా ఆత్మ విమర్శ ఎంతో ఆరోగ్యకరం,
మనకి ఏమి తెలియదన్న ఆందోళన నుండే మేధస్సు పుట్టుకువస్తుంది.
- గౌతమ బుద్ధుడు

ఏ వ్యక్తి అయినా కృషి లేకుండా పైకి రాడు.
సాధన, నిరంతర అంతరంగ మధనం,
అతన్ని ఒక్కొక్క అంగుళం చొప్పున ముందుకు నెడుతూ ఉంటాయి.
- గౌతమ బుద్ధుడు


NOTE--The picture credit goes to original phographer and source. It will be removed in case of any objections. The photo is a snapshot of rock cut Buddha Statue at Bojjanakonda caves, Anakapalle, Visakha dist. AP, India.

Saturday, February 26, 2011

పరుల దోషములు చూడకు!


యోగ్యులెవరో, అయోగ్యులెవరో పరిశీలించి మెలకువతో నెచ్చ్హెలులనెన్నుకోవలెను. మనసిచ్చి కొందరితో కల్సి మెలసి ఉండవచ్చు , కొందరితో ముఖ పరిచయం మాత్రమే తగును, కొందరితో మాట్లాడనే మాట్లాడరాదు.
- రామకృష్ణ పరమహంస


ఒకరికి మీరు వేయి విధముల సాయము చేతురుగాక, ఒక్క యొగ్గు చేసినంతనే కోపమున వారు యెడమొగము, పెడమొగము పెట్టెదరు. దోషములనే గ్రహించుట మానవ స్వభావము. పరుల దోషములు చూడకు, నీ కన్నులు పాపభూయిష్టములు కాగలవు.
- రామకృష్ణ పరమహంస