వివిధ గ్రంథాలు, మహాపురుషుల జీవిత గాథలు, కొన్ని మంచి పుస్తకాల నుండి గ్రహించబడిన వాటి సంకలనాలు ఈ పరమ సత్యం బ్లాగు నందు మీరు తెలుసుకొనవచ్చు.

Monday, October 24, 2011

భగవంతునికి ఆత్మీయుడవు!

భావంతో గాని,
ఆత్మతోగాని,
చేష్టలతో గాని,
వాక్కులతోగాని,
ఎవరినీ యే విధముగానూ భాదపెట్టకు.
ఏ ఒక్క ప్రాణి పైన అయినా కూడా దుర్భావాన్ని ప్రసరింపచేయడం వల్ల అనందధామం లో చోటు దొరకదు.
--ప్రేమానంద స్వామి

నీవెంత పవిత్రముగ,
పరిశుభ్రముగా,
మధురంగా,
సుందరముగా ఉండేకొద్ది భగవంతునికి అంత ఆత్మీయుడవు అవుతావు.
--ప్రేమానంద స్వామి

Sunday, October 16, 2011

వివేకవాణి 6

దివ్యశక్తి అందరిలోనూ ఉంది.
అంతర్గతంగా ఉన్న ఆ దివ్య శక్తిని తెలుసుకోవడమే మన జీవితగమ్యం!
మనలో ఉన్న దివ్యత్వాన్ని ప్రస్ఫుటం చేయడం ముఖ్యంగా బాహ్య, అంతర్ ఇంద్రియాలను
నియంత్రించడం వల్లనే సాధ్యమవుతుంది

--స్వామి వివేకానంద





Each soul is potentially divine.
The goal is to manifest this Divinity within by controlling nature,
external and internal.

-- Swami Vivekananda

Thursday, October 13, 2011

ఆధ్యాత్మిక తాపం!


!! ఆకలి గొన్న వానికే భోజనం ఇష్టముగ ఉంటుంది,
అదే విధముగా ఆధ్యాత్మిక తాపం కలిగిన వానికే ఆధ్యాత్మిక జీవితం మధురంగా ఉంటుంది.
-శ్రీ అనుభవానంద స్వామి


!! సాధనా జనితమైన సత్ విషయములు గ్రహిస్తే నీవు ఏకాగ్రస్థితిని పోందగలవు.
-శ్రీ అనుభవానంద స్వామి

Tuesday, October 11, 2011

వివేకవాణి 5

-->
ఆకలితోనున్న వానికి వేదాంత భోధ చేయుటకన్నా,
అతనికి అన్నం పెట్టి ఆదుకోవడం ముఖ్యం

- స్వామి వివేకానంద

-->
నీతి, న్యాయం ధ్యేయంగా ధర్మరక్షణ కర్తవ్యంగా యువత ముందుకు నడవాలి

- స్వామి వివేకానంద