వివిధ గ్రంథాలు, మహాపురుషుల జీవిత గాథలు, కొన్ని మంచి పుస్తకాల నుండి గ్రహించబడిన వాటి సంకలనాలు ఈ పరమ సత్యం బ్లాగు నందు మీరు తెలుసుకొనవచ్చు.

Thursday, January 21, 2010

రమణుల వాణి 1


ఒకనాడు ఒక భక్తుడు రమణ మహర్షితో "స్వామీ నిత్యం రామనామం జపిస్తున్నాను కానీ అంతరాయాల వల్ల మధ్యలో జపం మర్చిపోతున్నాను" అన్నాడు. దానికేముంది , మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి, జపించండి" అన్నారు రమణ మహర్షి.
"అంతరాయాలకు కారణం సంసారమే కదా, సంసారాన్ని వదిలేద్దాం అనుకుంటున్నా" అన్నాడు అతను. "ఒహో! అలాగా! ఇంతకీ సంసారం ఎక్కడుంటుందీ? లోపలా? బైటా? " అని ప్రశ్నించారు రమణులు. "సంసారమంటే, భార్యాపిల్లాలె కదండీ" అన్నాడతను.
"పాపం వాళ్ళేం చేశారండీ,ముందు సంసారమంటే ఎంటో తెలుసుకోండీ.మనస్సంసారమే సంసారం. దానిని వదిలేస్తే ఏ భాధా ఉండదు" అన్నారు రమణ మహర్షి.

1 comment:

భావన said...

బాగుందండి. మంచి మాట.