వివిధ గ్రంథాలు, మహాపురుషుల జీవిత గాథలు, కొన్ని మంచి పుస్తకాల నుండి గ్రహించబడిన వాటి సంకలనాలు ఈ పరమ సత్యం బ్లాగు నందు మీరు తెలుసుకొనవచ్చు.

Tuesday, October 12, 2010

యోగానంద మార్గం 4


మీ పని చేయగల వ్యక్తి ఒకే ఒక్కరు: ఆ వ్యక్తి మీరే.
మీ పని ఏదో ఒక విధముగా తోటి మనిషికి
సాయపడేటటైతేనే దానిని "సఫలత" అనగలం
- పరమహంస యోగానంద


సంతోషముగా ఉండడం అంటే
ఈశ్వరునితో ఏకీభావంతో ఉండడం .
సంతోషంగా ఉండడానికి కావలసిన శక్తి
ధ్యానం ద్వారా లభిస్తుంది
- పరమహంస యోగానంద

Monday, October 11, 2010

యోగానంద మార్గం 3



దేవుని కరుణ అనే వర్షపు జల్లులు
గర్వం అనే పర్వత శిఖరాలపై నిలవలేవు
కాని వినమ్రత అనే లోయలలోకి తేలికగా ప్రవహిస్తాయి
- పరమహంస యోగానంద

దేవుడు నీతొ ప్రత్యక్షముగా మాట్లాడడు ,
గురువు, గురుభోధనలు అనే మార్గం ద్వారానే
దేవుడు తనని తాను వ్యక్తం చేసుకుంటాడు
- పరమహంస యోగానంద

Saturday, February 13, 2010

గౌతమ వాక్కు 2

చుట్టూరా ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకోవడం కంటే,

ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైన వెలిగించడం మంచిది.
- గౌతమ బుద్ధుడు

Tuesday, February 9, 2010

ఉత్సాహమే బలం

ఉత్సాహమే బలం..
బలం కలవాడు ఎలా అన్ని సాధించగలడో ,
అలానే ఉత్సాహవంతుడూ సాధించగలుగుతాడు.
ఉత్సాహవంతునికి లభించనిది అంటూ ఎదీ లేదు.
- రామకృష్ణ పరమహంస

ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు.
పని అమర్చుకో, పెత్తనం కాదు..
- రామకృష్ణ పరమహంస

Thursday, February 4, 2010

గౌతమ వాక్కు 1


మనము చేసే కర్మల విషయంలో మనస్సే ప్రధానం!
మనసు ఏ తీరుగనుంటుందో, పనులూ ఆ తీరుగనే ఉంటాయి.
రాగద్వేషాలు లేని ప్రస్సన్నమైన మనసుతో ఎవడైతే పనులు చేస్తాడో,
అట్టివానిని సుఖం నీడలాగా అనుసరిస్తుంది.

- గౌతమ బుద్ధుడు

Sunday, January 24, 2010

యోగానంద మార్గం 2

ఆధ్యాత్మిక జీవితంలో వ్యక్తి కోపము, వ్యామోహము లేకుండా, పరిపూర్ణమైన ఆనందోత్సాహాలతో, పసిపాపలా అవుతాడు.
- పరమహంస యోగానంద

మీరు మీ సంకల్పశక్తిని నిర్మాణాత్మకమైన ప్రయోజనానికి ఎప్పుడూ వినియోగించగలిగి ఉంటేమీ భవితవ్యానికి మీరు శాసకులవుతారు!
- పరమహంస యోగానంద

Thursday, January 21, 2010

రమణుల వాణి 1


ఒకనాడు ఒక భక్తుడు రమణ మహర్షితో "స్వామీ నిత్యం రామనామం జపిస్తున్నాను కానీ అంతరాయాల వల్ల మధ్యలో జపం మర్చిపోతున్నాను" అన్నాడు. దానికేముంది , మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి, జపించండి" అన్నారు రమణ మహర్షి.
"అంతరాయాలకు కారణం సంసారమే కదా, సంసారాన్ని వదిలేద్దాం అనుకుంటున్నా" అన్నాడు అతను. "ఒహో! అలాగా! ఇంతకీ సంసారం ఎక్కడుంటుందీ? లోపలా? బైటా? " అని ప్రశ్నించారు రమణులు. "సంసారమంటే, భార్యాపిల్లాలె కదండీ" అన్నాడతను.
"పాపం వాళ్ళేం చేశారండీ,ముందు సంసారమంటే ఎంటో తెలుసుకోండీ.మనస్సంసారమే సంసారం. దానిని వదిలేస్తే ఏ భాధా ఉండదు" అన్నారు రమణ మహర్షి.

Monday, January 18, 2010

వివేకవాణి 4

ఉండేది ఒక్కటే స్వచ్చమైన తెల్లని కాంతి, అదే భగవంతుని ప్రసరణం - ప్రతి జీవుని కేంద్రం.
ప్రతీ మనిషిని ఒక గాజుగోళంతో పోల్చవచ్చు. గాజుగోళపు రంగు దలసరితనం ఒక్కొకనిలో ఒక్కో విధముగా ఉండటం చేత కిరణాలు ప్రసరమవటంలో విభిన్న లక్షణాలను పొందుతాయి.
సర్వులలోను కేంద్రముగా ఉన్న జ్యోతి ఒక్కటే. అది సర్వత్రా సమానమే!
- స్వామి వివేకానంద

Friday, January 15, 2010

యోగానంద మార్గం 1


నీ భయానికి కారణమైన దానికి ఎడుటపడి చూడు: అది నిన్నింక ఇబ్బంది పెట్టదు.
-- పరమహంస యోగానంద

ధ్యానం లో మౌనంగా కూర్చుని దేవునితో సంభాషించడమే నిజమైన ధర్మాచరన, కానీ తగినంత ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు మాయలో ఉంటారు.
-- పరమహంస యోగానంద

Wednesday, January 13, 2010

ధర్మప్రాప్థికి మార్గాలు

స్వాతంత్ర్యం ధర్మం, పరతంత్రం పాపం ఇతరులను ప్రేమించడం ధర్మం, ఇతరులను ద్వేషించడం పాపం బలపౌరుషాలు ధర్మం బలహీనత, పిరికితనం పాపం.. ఆత్మయందుగల విశ్వాసం ధర్మం, సందేహించడం పాపం ఇతరులకు మేలు చేయడం ధర్మం, ఇతరులకు కీడు చేయడం పాపం

Tuesday, January 12, 2010

వివేకవాణి 3


మనిషికి కావల్సిన లక్షణం - ఆశయసిద్ది కోసం దృఢమైన కోరిక.
- స్వామి వివేకానంద

మనల్ని కర్మాచరణకు పురికొల్పేవి భావాలే కాబట్టీ, మనస్సును అత్యున్నత భావాలతో నింపుకోండి!
- స్వామి వివేకానంద

పరిస్థితులను ఎదుర్కొని పోరాడినపుడే ఆదర్శవంతమైన విజయం లభిస్తుంది!
- స్వామి వివేకానంద

జనవరి 12 స్వామి వివేకానంద ఆవిర్భావదినోత్సవం

Sunday, January 10, 2010

వివేకవాణి 2

వేదన పడటమే కాకుండా, విషయాల అర్థం అంతర్యం గ్రహించాగాలిగినవరై ఉండాలి :హృదయవేదనను, జ్ఞానాన్ని కార్యరుపంలో నిరుపించగాలగాలి
- స్వామి వివేకానంద

మానవ మనుగడకు పరమావధి సుఖం కాదు, ఆత్మ జ్ఞానం
- స్వామి వివేకానంద

Wednesday, January 6, 2010

వివేకవాణి 1

అనుకున్న కార్యాన్ని సాధించడానికి మనసు బుద్ది చిత్తాలను సంపూర్ణంగా నిమగ్నం చేయగలిగిననాడు ఏ ప్రలోభాలైనా మన చిత్త ఏకాగ్రతను సడలించలేవు
- స్వామి వివేకానంద

If you can think that infinite power, infinite knowledge lie within you, and if you can bring out that power, you also can become like me - swAmi VivEkAnanda


అనంత శక్తి అఖండ జ్ణానము మీలోనే ఉంది ఆ శక్తిని బైటకు తీయగలిగితే మహోన్నతులు అవుతారు!
- స్వామి వివేకానంద

Whatever you do, devote your whole mind, heart, and soul to it...
- Swami Vivekananda

Tuesday, January 5, 2010

శ్రీ పరమహంస యోగానంద ఆవిర్భావదినొత్సవం

5 జనవరి శ్రీ పరమహంస యోగానంద గారి ఆవిర్భావదినొత్సవం.

Monday, January 4, 2010

పరమ సత్యం

పరమ సత్యం బ్లాగునకు స్వాగతం ఇక్కడ అనేక ఆధ్యాత్మిక విషయ, వివరములను పొందుపరుస్తున్నాను. ఇవి మనందరి అభ్యున్నతికై ఉపయోగపడతాయి. గురువుల బోధనలు సైతం కొన్ని కొన్ని ఇక్కడ పెడుతుంటాను నాకు తెలిసినంతవరకు. అందరికీ ధన్యవాదములు మరియు నూతన సంవత్సర శుభాకంక్షలు!


నేను మిమ్మల్ని చూడడం లేదంటే, మీ కోసం నేను వెరే చోట పని చేస్తున్నానని గుర్తుంచుకోండీ నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నంత మాత్రాన మీకు ఉపయోగం లేకపోవచ్చు మీరు క్రమం తప్పకుండా, నియమానుసారం గాఢంగా ధ్యానించడం వల్ల్ అధిక లాభం పొందుతారు. ఈ జీవితంలోనే సాయపడడానికే కాదు నేనిక్కడ ఉన్నది, ముందుజన్మల్లో కూడా నేను మీకు సాయం చేస్తాను.
--- పరమహంస యోగానంద